
Deepti Bhatnagar Glamorous Photos At Age 54: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన పెళ్లి సందడి సినిమా అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. జనవరి 12, 1996లో విడుదలైన ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోరు. ముఖ్యంగా హీరోగా శ్రీకాంత్‌కు, హీరోయిన్లుగా రవళి, దీప్తి భట్నాగర్‌కు తిరుగులేని పేరు తీసుకొచ్చింది. అక్కాచెల్లెళ్లుగా నటించిన రవళి, దీప్తి భట్నాగర్ ఆడియెన్స్ మన్ననలు పొందారు. ఇందులో సౌందర్య లహరి అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈపాటలో వర్ణించినట్లు దేనికితీసిపోకుండా ఉంటుంది అందాల భామ దీప్తి భట్నాగర్. ఆ సినిమా నుంచి ఆమె ఎందరికో సౌందర్య లహరిగా మారింది.
ఆ సాంగ్‌లో దీప్తి భట్నాగర్ గ్లామర్ చూసి మిగతా హీరోయిన్లు ఈర్ష్య పడ్డారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న బ్యూటీ 54 ఏళ్ల వయసులో కూడా గ్లామరస్ ఫొటోలతో అదరగొడుతోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఇప్పటికీ అభిమానులను, నెటిజన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హాట్ హాట్ ఫొటోషూట్‌లతో నేటితరం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అని చెప్పకనే చెబుతోంది.
బాలీవుడ్ హీరోయిన్‌గా తెలుగులోకి వచ్చిన దీప్తి.. నాగార్జునతో ఆటో డ్రైవర్, బాలకృష్ణతో సుల్తాన్, మోహన్ బాబుతో కొండవీటి సింహాసనం, రాజశేఖర్‌తో మా అన్నయ్య వంటి చిత్రాల్లో అలరించింది. ఆ సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన దీప్తి భట్నాగర్ డైరెక్టర్ రణదీప్ ఆర్యను వివాహం చేసుకుంది. ఇద్దరు కమారులు ఉన్న దీప్తి భట్నాగర్ 1967 సెప్టెంబర్ 30న మీరట్‌లో జన్మించింది.
Comments
Please login to add a commentAdd a comment