తమిళనాడు రియల్‌ పాలిటిక్స్‌ ఆధారంగా ధనుష్‌ మూవీ! | Dhanush, Sekhar Kammulas Film Based On Real Politics? | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ టచ్‌ : అప్పుడు రానా.. ఇప్పుడు ధనుష్‌

Published Thu, Jun 24 2021 5:36 PM | Last Updated on Thu, Jun 24 2021 5:36 PM

Dhanush, Sekhar Kammulas Film Based On Real Politics? - Sakshi

కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ధనుష్‌ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం, అది కూడా శేఖర్‌ కమ్ముల డైరెక‌్షన్‌ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.

ఇక సినిమా నేపథ్యం ఏమై ఉంటుందన్న క్యూరియాసిటీ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. పొలిటికల్‌ టచ్‌తో సినిమా ఉండనుందని తెలుస్తోంది. గతంలో రానాను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ శేఖర్ కమ్ముల లీడర్‌ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రానాకు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు హీరోగానూ నిలబెట్టింది. ఇప్పుడు మరోసారి పొలిటికల్‌ టచ్‌తో మెప్పించేందుకు శేఖర్‌ కమ్ముల కథ సిద్ధం చేశారట. 

చదవండి : మరోసారి రిపీట్‌ కానున్న ధనుష్‌-సాయిపల్లవి జోడీ
శేఖర్‌ కమ్ముల సినిమా: ధనుష్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement