Hero Dhanush Announces First Telugu Film With Venky Atluri - Sakshi
Sakshi News home page

Dhanush: ధనుష్‌ తెలుగు సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది

Dec 22 2021 5:31 PM | Updated on Dec 23 2021 12:40 PM

Dhanush Announces First Telugu Film With Venky Atluri First Look and Title Update - Sakshi

Dhanush Straight Telugu Film: కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్‌ అవడమే కాక ఇక్కడ కూడా మంచి హిట్‌ అందుకున్నాయి. దీంతో అతడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయడానికి అంగీకరించాడు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ప్రాజెక్టుకు ధనుష్‌ పచ్చజెండా ఊపాడు.

ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. 'తమిళంలో నా నెక్స్ట్‌ మూవీ, తెలుగులో నా తొలి సినిమా.. రేపు(గురువారం) ఉదయం 9 గంటల 36 నిమిషాలకు టైటిల్‌ వెల్లడిస్తాం' అంటూ హీరో ధనుష్‌ ట్వీట్‌ చేశాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నారాయణదాస్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌ రావు నిర్మించనున్నారు.తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement