ప్రభాస్‌ అతిథి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా? | Did You Know Prabhas Guest Role In This Bollywood Film | Sakshi
Sakshi News home page

Prabhas: కన్నప్పకు ముందు ప్రభాస్‌ గెస్ట్‌ రోల్‌ చేసిన మూవీ?

Published Mon, Jun 24 2024 10:48 AM | Last Updated on Mon, Jun 24 2024 11:12 AM

Did You Know Prabhas Guest Role In Bollywood Film

ప్రభాస్‌ గతేడాది ఆదిపురుష్‌తో ఫ్లాప్‌, సలార్‌తో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది కల్కి 2898 ఏడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ గురువారమే కల్కి సినిమా విడుదల కానుంది. ఆల్‌రెడీ బుకింగ్స్‌ కూడా ఓపెన్‌ అయ్యాయి. మరోవైపు ప్రభాస్‌ కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అయితే కన్నప్ప కంటే ముందు ప్రభాస్‌ ఓ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు.

ఓ పాటలో..
అది తెలుగు సినిమా అయితే కాదు! 2014లో వచ్చిన యాక్షన్‌ జాక్సన్‌ అనే హిందీ సినిమా! ప్రభుదేవా డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గణ్‌ ద్విపాత్రాభినయం చేయగా సోనాక్షి సిన్హ, యామీ గౌతమ్‌ హీరోయిన్లుగా నటించారు. కునాల్‌ రాయ్‌ కపూర్‌, మనస్వి, ఆనందరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని పంజాబీ మస్త్‌ అనే పాటలో ప్రభాస్‌ కనిపించాడు. హీరోయిన్‌ సోనాక్షి సిన్హతో కలిసి డ్యాన్స్‌ చేశాడు.

పదేళ్ల తర్వాత..
మళ్లీ దశాబ్ద కాలం తర్వాత కన్నప్ప మూవీలో డార్లింగ్‌ అతిథిగా నటిస్తున్నాడు. అయితే ఈసారి కేవలం పాటలో మాత్రమే కనిపించకుండా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రను కూడా ప్రభాసే ఏరికోరి ఎంచుకున్నాడని ఇటీవల మంచు విష్ణు వెల్లడించాడు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్‌బాబు పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

 

చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement