![Dipika Kakar rubbishes reports of quitting acting - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/30/dipika.jpg.webp?itok=pbHnf6uh)
ఇదివరకే బాలీవుడ్ బుల్లితెర నటి దీపికా కక్కర్ అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను తల్లిని కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 2018లో సహనటుడు షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడిన దీపికా.. ఐదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీని ప్రకటించింది. దీంతో ఆమె నటనకు గుడ్ బై చెప్పనుందని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అయితే ఈ వార్తలపై దీపికా కక్కర్ క్లారిటీ ఇచ్చింది.
(ఇది చదవండి: పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి షాకింగ్ నిర్ణయం!)
నా వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని దీపికా తెలిపింది. నేను యాక్టింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వివరించింది. మంచి ఆఫర్లు వస్తే నటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ప్రకటించింది. కేవలం తనకు పుట్టబోయే బిడ్డ కోసం కోసం కొద్ది రోజులు విరామం తీసుకుంటున్నట్లు తెలిపారు.
(ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి)
కాగా.. ససురల్ సిమర్ కాలో సిమర్ భరద్వాజ్ పాత్రతో దీపికా ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్- 12లో కూడా పాల్గొని విజేతగా నిలిచింది. దీపిక ఝలక్ దిఖ్లా జా, నాచ్ బలియే 8, కహాన్ హమ్ కహాన్ తుమ్ వంటి టీవీ షోలలో కూడా కనిపించింది. ససురల్ సిమర్ కాలో తన సహనటుడు షోయబ్ ఇబ్రహీమ్‌ను 2018లో వివాహం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment