ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాఫీ విత్ ఎ కిల్లర్'. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ట్రైలర్‌ను విడుదల చేశారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'కరోనా తరువాత రీ రీలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. అలాంటి స్కోప్ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్‌లో కనిపిస్తోంది. కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతాయా అని ఇప్పుడే అర్థమైంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ట్రైలర్ కనిపిస్తోంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్పీ గారే హీరో అనిపించింది. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.' అని అన్నారు.
దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘ఓటీటీ వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేం. ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకున్నా.అందుకు నా మరో తమ్ముడు సెవెన్‌హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఈ చిత్రంలో ఒక సీక్రెట్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రివీల్ చేస్తాం. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడిగారికి కృతఙ్ఞతలు. ఎందుకో ఆయనకు నేనంటే చాలా అభిమానం.' అని అన్నారు.
నిర్మాత సెవెన్‌హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. 'ఆర్పీ గారు నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. ఈ సినిమా లైన్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలనుకున్నా. ఈ చిత్రంలో ఒక చిన్నసర్‌ప్రైజ్ ఉంది. అది త్వరలో రివీల్ చేస్తాం. ఆర్పీ పట్నాయక్‌తో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, రవి బాబు, సత్యం రాజేష్, రఘు బాబు, జెమినీ సురేష్, రవి ప్రకాష్, టెంపర్ వంశీ, బెనర్జీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment