Disha Patani Interesting Comments On Prabhas In Her Latest Interview, Deets Inside - Sakshi
Sakshi News home page

Disha Patani-Prabhas: ప్రభాస్‌పై దిశ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలాంటి హీరోని ఇంతవరకు చూడలేదు

Published Tue, Jul 26 2022 8:58 PM | Last Updated on Wed, Jul 27 2022 9:15 AM

Disha Patani Interesting Comments On Prabhas In Latest Interview - Sakshi

‘లోఫర్‌’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దిశ పటానీ. తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. అయినా ఇక్కడ ఆమెకు పెద్దగా ఆఫర్స్‌ రాలేదు. దీంతో బాలీవుడ్‌పైనే ఫోకస్‌ పెట్టిన ఆమె భాగీ 2, భాగీ 3, రాధే, ఎంఎస్ ధోనీ వంటి సూపర్ హిట చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె హిందీలో పలు చిత్రాలతో పాటు ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కెలో నటిస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకోనె మెయిన్‌ హీరోయిన్‌ కాగా.. దిశ సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.

చదవండి: ఇక యాక్టింగ్‌కి బ్రేక్‌.. అందుకే అంటున్న స్టార్‌ హీరోయిన్‌

ఇటీవలె షూటింగ్‌లో సెట్‌లో కూడా అడుగుపెట్టింది. దీనితో పాటు ఆమె నటిస్తున్న మరో చిత్రం ‘ఏక్‌ విలన్‌ రిటర్న్‌’. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించింది ఆమె. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ కె మూవీ విశేషాలతో పాటు ‘డార్లింగ్‌’ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌ స్టార్‌ అనే విషయాన్ని పక్కన పెట్టి చాలా సింపుల్‌గా ఉంటాడని విన్నాను. నిజంగానే ఆయన ఎంత మంచి వ్యక్తో దగ్గరి నుంచి చూశాను.

చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌.. నీళ్లు నమిలిన విజయ్‌

నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్ ఒకరు. అందరూ చెప్పినట్టుగానే ఆయన ఇంటి నుంచి తెప్పించిన భోజనాన్ని స్వయంగా వడ్డించాడు. నాకే కాదు టీం మొత్తానికి ఆయన భోజనం తెప్పించారు. ఆయన అందరిని చాలా అభిమానిస్తారు. ఆయన చూపించే ప్రేమను ఎవరు అంత తెలికగా మరిచిపోరు.అలాంటి హీరోను నేను ఇంతవరకూ చూడలేదు. ఆయనతో నటించడం చాలా సులభం’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ కీ రోల్‌ పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement