పాన్‌ ఇండియా హీరో ఫోటో షేర్‌ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..? | Disha Patani Shares Prabhas Photo | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా హీరో ఫోటో షేర్‌ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?

Published Thu, Mar 7 2024 1:50 PM | Last Updated on Thu, Mar 7 2024 3:07 PM

Disha Patani Sher Prabhas Photo - Sakshi

ప్రభాస్‌ కల్కి 2898 AD సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈమేరకు ఈ ప్రాజెక్ట్‌ సంబంధించిన యూనిట్ అంతా ఇటలీలో ల్యాండ్ అయింది. అక్కడి అందమైన లొకేషన్లలో ఓ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్‌. హీరో ప్రభాస్, హీరోయిన్ దిశా పటానీ కాంబినేషన్‌లో ఆ పాటను చిత్రీకరించారు. 

అందుకు సంబంధించిన తన షూట్ ముగించుకుని ఢిల్లీ వచ్చినట్లుగా బాలీవుడ్  బ్యూటి దిశా పటానీ సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసింది. విమానంలో డార్లింగ్ ప్రభాస్‌ను ఫోటోను తీయడం ఆ ఫోటోలో కనిపిస్తుంది. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.  ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు ఓ మెలోడీ లవ్‌ సాంగ్‌ను ఇటలీలో చిత్రీకరించారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్‌ చిత్రీకరణ పూర్తి అయిందని తెలిసింది. 

ఇక కల్కి మూవీ టీమ్ కూడా ఇటలీ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలో ప్రభాస్, దిశా పటానీతోపాటు నాగ్ అశ్విన్ ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు. మైథాలజీ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ నేఫథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement