ఇటలీ బీచ్‌లో ప్రభాస్‌, దిశాపటానీ | Prabhas And Disha Patani Shooting In Italy | Sakshi
Sakshi News home page

ఇటలీ బీచ్‌లో ప్రభాస్‌, దిశాపటానీ

Published Tue, Mar 5 2024 1:15 PM | Last Updated on Tue, Mar 5 2024 1:28 PM

Prabhas And Disha Patani In Italy - Sakshi

ప్రభాస్‌ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మే 9న విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమం వేగంగా జరుగుతుంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణెతో పాటు దిశాపటానీ నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. 

తాజాగా కల్కి సినిమాకు సంబంధించిన ఒక పాటను  ఇటలీలోని సార్డినియా ద్వీపంలో ప్రభాస్‌, దిశాపటానీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. అద్భుతమైన లోకేషన్‌లలో ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. బీచ్‌లో వారిద్దరి మధ్య రొమాంటిక్‌ సాంగ్‌ను మేకర్స్‌ చిత్రీకరిస్తున్నారట. అందుకు సంబంధించిన పలు విషయాలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. సినిమాను అనుకున్న సమయంలోపు విడుదల చేయాలన్ని పక్కా ప్లాన్‌తో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ పనిచేస్తున్నారట.

ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్‌ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ పెట్టామని నాగ్‌ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement