అందం, అభినయం, అభిమానం.. ఇవన్నీ పుష్కలంగా ఉండే హీరోయిన్ ఎవరనగానే అలనాటి అందాల నటి సావిత్రే గుర్తొస్తారు. కానీ ఆ సావిత్రిని ఈ జనరేషన్‌కు పరిచయం చేస్తూ 'మహానటి'గా మెప్పించింది హీరోయిన్ కీర్తి సురేశ్. సావిత్రిగా జీవించి ప్రజలను ఏడిపించిన కీర్తి సురేశ్ బాల్యంలోనే కెమెరా ముందుకు వచ్చింది. చిన్నప్పటి నుంచే సంపాదించడం మొదలు పెట్టింది. అయితే తను ఆర్జించినదాన్ని అంతా తండ్రికి ముట్టజెప్పేదాన్నంటోంది కీర్తి.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను నటించిన సినిమాకు నిర్మాతలు డబ్బుల కవర్ చేతికిచ్చేవారు. దాన్ని నేరుగా తీసుకుని నాన్నకు అప్పజెప్పేదాన్ని. అందులో అసలు ఎంత డబ్బుందని కూడా తెలుసుకోవాలనుకోలేదు. కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు ఒక షోలో పాల్గొన్నాను. అప్పుడు రూ.500 ఇచ్చారు. ఊహ తెలిశాక అందుకున్న డబ్బు ఇదే కాబట్టి. ఇదే నా తొలి సంపాదనగా భావించాను. కానీ సెంటిమెంట్‌గా మళ్లీ నాన్నకే ఇచ్చేశాను" అని చెప్పుకొచ్చింది. ఇదిలా వుంటే కీర్తి సురేశ్.. రజనీకాంత్ అన్నాత్తే, మహేశ్‌బాబు సర్కారు వారి పాట చిత్రాల్లో నటిస్తోంది. తను ప్రధానపాత్రలో నటించిన గుడ్ లక్ సఖి రిలీజ్‌కు రెడీగా ఉంది.
చదవండి: మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేశారు: కీర్తి సురేశ్
Comments
Please login to add a commentAdd a comment