త్వరలో తల్లి కాబోతున్న 'సాహో' నటి, ఇదే పెద్ద గిఫ్ట్‌! | Evelyn Sharma and Tushaan Bhindi Expecting First Child Holds Baby Bump in Pregnancy Announcement | Sakshi
Sakshi News home page

Evelyn Sharma: త్వరలో తల్లి కాబోతున్న 'సాహో' బ్యూటీ

Published Sun, Jul 11 2021 4:50 PM | Last Updated on Sun, Jul 11 2021 4:50 PM

Evelyn Sharma and Tushaan Bhindi Expecting First Child Holds Baby Bump in Pregnancy Announcement - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మ త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. చిన్నారిని నా చేతుల్లోకి తీసుకుని ఆడించేందుకు ఎదురు చూస్తున్నానంటూ బేబీ బంప్‌ ఫొటోను షేర్‌ చేసింది. దీంతో ఆమెకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలో ఓ కొత్త అతిథి తమ ఇంట అడుగు పెట్టబోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిందీ నటి. రేపు(జూలై 12) తన బర్త్‌డే అని, ఈసారి ఇదే తనకు అతి పెద్ద బర్త్‌డే గిఫ్ట్‌ అని పేర్కొంది. కడుపులోని బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాక ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను కలుస్తామని చెప్పుకొచ్చింది.

కాగా ఎవెలిన్‌ ఆస్ట్రేలియాకు చెందిన దంత వైద్యుడు తుషన్‌ బిండీతో 2019లో నిశ్చితార్థం జరుపుకుంది. అనంతరం కోవిడ్‌ నియమ నిబంధనల మధ్య ఈ ఏడాది మే 15లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా జూన్‌లో అధికారికంగా వెల్లడించారు. 'ఏ జవానీ హై దీవాని, మై తేరా హీరో, జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ వంటి హిందీ చిత్రాల్లో నటించిన ఎవెలిన్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’లో ఓ కీలక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement