Evelyn Sharma Gives Birth To Daughter Ava Bhindi- Sakshi
Sakshi News home page

పాపకు జన్మనిచ‍్చిన బాలీవుడ్‌ నటి.. మొదటి ఫొటో చూశారా ?

Published Fri, Nov 19 2021 2:55 PM | Last Updated on Fri, Nov 19 2021 8:12 PM

Evelyn Sharma Gives Birth To  Daughter Ava Bhindi - Sakshi

బాలీవుడ్‌ నటి ఎవెలిన్‌ శర్మ పాపకు జన్మనిచ్చింది. ఎవెలిన్‌, ఆమె భర్త తుషాన్‌ భిండీ మొదటి సంతానం 'అవ భిండీ' వారి జీవితంలోకి అడుగుపెట్టింది. నవంబర్‌ 19 శుక్రవారం తన బేబీని ముద్దాడుతున్న మొదటి ఫొటోను ఇన్‌స్టా గ్రామ్‌లో  ఎవెలిన్‌ షేర్‌ చేసింది. ఎవెలిన్‌ శర్మ తన మ్యారెజ్‌ ఫొటోలను జూన్‌లో పోస్ట్‌ చేసి అందర‍్ని ఆశ్చర్యపరిచింది. ఒక నెల తర‍్వాత వారి తొలి సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె ప్రకటించింది. తాజాగా ఆమె పాప 'అవ భిండీ'తో ఉన్న ఫొటోను పంచుకుంది. ఈ ఫొటోలో పాపను ప్రేమగా ముద్దాడుతూ, 'నా జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర. అవ భిండీకి తల్లిగా..' అంటూ రాసుకొచ్చింది ఎవెలిన్‌ శర్మ. 


గత నెలలో, ఎవెలిన్‌ తన బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్‌ చేస్తూ తల్లిదండ‍్రులుగా ఉండటానికి సలహాలు  ఇవ్వండని ప్రతి ఒక్కరినీ కోరింది. 'మేము తల్లిదండ్రులం కాబోతున్నందుకు ఉత్సాహంగా ఉన్నాం. కానీ కొన్ని పుస్తకాలు, కొందరితో మాట్లాడిన తర్వాత మేమింకా సిద్ధం అవడానికి ఏం లేదని అర‍్థమైంది. తల్లిదండ్రులుగా ఎలా ఉండాలో సలహా ఇవ్వండి. ప్లీజ్‌ ?' అంటూ ఎవెలిన్‌ పోస్ట్‌ చేసింది. 

మే 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్‌లో కంట్రీ స్టైల్‌ వెడ్డింగ్‌ తరహాలో ఎవెలిన్‌ తన ప్రియుడు తుషాన్‌ భిండీని వివాహం చేసుకుంది. తుషాన్‌ ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్‌  సర్జన్‌, వ్యాపారవేత్త. 2018లో వీరి మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్‌ ఏర్పాటు చేసిన బ్లైండ్‌ డేట్‌లో ఎవెలిన్, తుషాన్‌ కలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement