Faria Abdullah OTT Series: 'జాతిరత్నాలు' సినిమా పేరు చెప్పగానే చాలామంది నవీన్-రాహుల్-దర్శి చేసిన కామెడీ గుర్తొస్తుంది. కొందరికి మాత్రం అందులో హీరోయిన్ చిట్టి గుర్తొస్తుంది. ఆ మూవీతో హీరోయిన్‌గా బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది. కానీ ఎందుకో ఆ క్రేజ్ ని కొనసాగించలేకపోయింది. అవకాశాలు కూడా సరిగా రాలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తోంది.
తెలుగులో నో లక్
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చిట్టి అసలు పేరు ఫరియా అబ్దుల్లా. 'జాతిరత్నాలు' తో ఫస్ట్ ఫస్టే హీరోయిన్ గా చాలా గుర్తింపు తెచ్చుకుంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా గెస్ట్ రోల్ చేసింది. 'బంగార్రాజు'లో ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది. 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' మూవీలో హీరోయిన్ గా చేసింది గానీ అది హిట్ అవ్వలేదు. ఈ ఏడాది 'రావణాసుర'లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. దీని రిజల్ట్ కూడా సేమ్.
(ఇదీ చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్)
ఓటీటీ ఎంట్రీ
ఇక సినిమాల పరంగా ఫరియా కొత్తగా ఏం చేయట్లేదు. అలా అని ఖాళీగా లేదు. ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైపోయింది. మనదేశంలో తొలిసారి క్లి-ఫై(క్లైమేట్ ఛేంజ్) కాన్సెప్ట్ తో తీస్తున్న 'ద జెంగబూరు కర్స్' వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తోంది. ఆగస్టు 9 నుంచి సోనీ లివ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ సిరీస్ కథేంటి?
ప్రియ(ఫరియా అబ్దుల‍్లా) ఎన్ఆర్ఐ. కనిపించకుండా పోయిన తన తండ్రిని వెతుకుతూ ఒడిశాలోని జెంగబూరు అనే చిన్న ఊరికి వస్తుంది. అలా వచ్చిన ప్రియాకు అక్కడే జరుగుతున్న మైనింగ్ వ్యాపారాల గురించి ఏం తెలిసింది? మైనింగ్ బిజనెస్ వల్ల ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
(ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప‍్పుడే!)
Comments
Please login to add a commentAdd a comment