
‘యజ్ఞం, ఏం పిల్లో ఏం పిల్లడో’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఏ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఫ్లాష్ బ్యాక్’. ‘లేనిది ఎవరికి’ అనేది ఉపశీర్షిక. ఆద్యా ఆర్ట్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై కార్తీక రెడ్డి నిర్మించనున్నారు. సోమవారం రవికుమార్ చౌదరి, ఆయన కూతురు ఋగ్వేద పుట్టినరోజు సందర్భంగా ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమాతో పాటు తర్వాత చేయనున్న మరో సినిమా వివరాలను వెల్లడించారు రవికుమార్. ‘‘సెప్టెంబర్ రెండో వారం నుంచి కోవిడ్ నిబంధనలు అనుసరించి ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. ఆ సినిమా తర్వాత నా మాతృ సంస్థ ఈతరం ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఓ చిత్రానికి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment