గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
తాజాగా సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 28న సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. పల్లవిలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ పక్కా మాస్ బీట్ ఇచ్చాడని ఇట్టే తెలిసిపోతుంది.
ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
పండగ మొదలు!
பண்டிகை முதல்!
त्यौहार शुरू!
Let the festivities begin 💥❤️🔥#RaaMachaMacha #DamTuDikhaja #GameChanger pic.twitter.com/R0VtIF81DS— Game Changer (@GameChangerOffl) September 25, 2024
Comments
Please login to add a commentAdd a comment