యూత్‌ టార్గెట్‌గా ‘జిటిఎ’ | GTA Movie Release Date Out | Sakshi
Sakshi News home page

GTA Movie: యూత్‌ టార్గెట్‌గా ‘జిటిఎ’

Published Fri, Sep 22 2023 6:21 PM | Last Updated on Fri, Sep 22 2023 6:34 PM

GTA Movie Release Date Out - Sakshi

చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా  నటించిన తాజా చిత్రం జిటిఎ(GTA). దీపక్ సిద్ధాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. జిటిఏ గేమ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్‌ పోస్టర్‌ని రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న GTA సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 90కిడ్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్ తో ఈ సినిమా రాబోతోందని తెలిపారు.

GTA అనే గేమ్ ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీయడం జరిగిందని దర్శకుడు దీపక్ సిద్ధాంత్ తెలిపారు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement