ఇటీవల ‘సెహరి’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచింగ్ సమయంలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తించిన తీరు గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉది. సెహరితో హీరోగా పరిచయమవుతున్న హర్ష కనుమల్లి పట్ల బాలకృష్ణ ప్రవర్తనపై నెట్టింట్లో మీమ్స్ మోత మోగుతోంది. ఈ కార్యక్రమంలో పోస్టర్ విడుదల సందర్భంగా బాలయ్య.. సినిమా పోస్టర్‌ను పట్టుకుంటున్న హీరో హర్ష్ కనుమిల్లి చేతిని కొట్టినట్లుగా కనిపించాడు. అదే సమయంలో బాలయ్య ఫోన్ రింగ్ అవ్వడంతో కోపంతో దాన్ని తీసి పక్కకు విసిరి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. అలాగే కరోనాకి వ్యాక్సిన్ ఎప్పటికీ రాదని, దాని సంగతి నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఈ సంఘటనలపై నెటిజన్లు వీపరితంగా స్పందిస్తున్నారు. ఫన్నీ కామెంట్స్, మీమ్స్‌లతో ఓ ఆడుకుంటున్నారు. చదవండి : ఫోన్ విసిరేసిన బాలకృష్ణ : వైరల్ వీడియో
ఈ క్రమంలో యువ నటుడు హర్ష కనుమల్లి స్పందించాడు. బాలకృష్ణ తీరును తప్పుగా అర్థం చేసుకున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘నిజానికి బాలకృష్ణ నన్ను కొట్టలేదు. నేను పోస్టర్‌ను ఎడమ చేతితో పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే హీరోగా నా తొలిచిత్రం కాబట్టి ఎడమ చేతితో పోస్టర్ పట్టుకోవడం మంచిది కాదని ఆయన(బాలయ్య) నా చేతిని పక్కకు లాగాడు. అంతేగాని ఉద్ధేశ్యపూర్యకంగా చేసిన పని కాదు. అలాగే బాలకృష్ణ చాలా మంచి వారు. మేము మా కార్యక్రమానికి రావాలని కోరిన వెంటనే రావడానికి ఒప్పుకున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు’. అంటూ క్లారిటీ ఇచ్చాడు. అలాగే మీమ్స్‌పై స్పందిస్తూ క్రియెటీవిటిగా మీమ్స్ సృష్టించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఫోన్ విసిరేసిన బాలయ్య.. స్పందించిన హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment