
‘‘హాలీవుడ్, బాలీవుడ్‌లో జాంబీస్ జానర్‌లో కొన్ని సినిమాలు వచ్చాయి. తెలుగులో ‘జి–జాంబీ’ చిత్రం విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందడం సంతోషం. ‘జి–జాంబీ’ లాంటి కొత్త టీమ్‌ని ప్రోత్సహించినప్పుడే వైవిధ్యమైన సినిమాలు వస్తాయి. ఇంత మంచి సినిమా తీసిన ఆర్యన్ గౌరని అభినందిస్తున్నాను’’ అని నటుడు సోనూ సూద్ అన్నారు. ఆర్యన్ గౌర, దివ్య పాండే జంటగా నటించిన చిత్రం ‘జి–జాంబీ’. ఆర్యన్ –దీపు దర్శకత్వం వహించారు. సూర్య నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలయింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు సోనూ సూద్. ఆర్యన్ గౌర మాట్లాడుతూ–‘‘సోనూ సూద్ మమ్మల్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహం, స్ఫూర్తితో మరొక వైవిధ్యమైన కథతో సినిమా చేయనున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మేలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment