
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన 'టైటానిక్' సినిమా అంటే ఇష్టం ఉండని వారుండరు. సాధారణంగా ఒక సినిమాను రెండు, మూడు లేదా పదిసార్లకు మించి చూడలేరు. ఒకవేళ చూసిన ఆ సినిమా బోర్ కొట్టేస్తుంది. అయితే ఎన్నిసార్లు చూసిన మళ్లీ చూడాలనిపించే చిత్రం టైటానిక్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. అద్బుతమైన రొమాంటిక్ క్లాసికల్ డ్రామాగా రియల్ సంఘటనగా ఆధారంగా ‘టైటానిక్’ను దర్శకుడు కామెరూన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో షిప్ మునిగిపోతున్న సమయంలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రముఖ హీరో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించారు.
ఇక హీరోయిన్‌గా నటించిన కేట్ విన్స్‌లెట్ తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కాగా టైటానిక్ వచ్చి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా హీరోయిన్ కేట్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె టైటానిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌నే మలుపుతిప్పిన ఈ సినిమా అంటే అసలు ఇష్టం ఉండదని, ఇప్పుడు ఈ సినిమా చూడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతం కేట్ అవతార్ సీక్వెల్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. కాగా టైటానిక్ డైరెక్టర్ కామెరూన్ ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment