'నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో మమ్మల్ని చంపకు పాయల్'‌.. | Heroine Payal Rajput Cute Expressions For Vijay Devarakonda Song viral | Sakshi
Sakshi News home page

విజయ్‌ దేవరకొండ పాటకి సిగ్గు పడుతూ వీడియో‌

Published Wed, Mar 24 2021 8:36 PM | Last Updated on Wed, Mar 24 2021 8:58 PM

Heroine Payal Rajput Cute Expressions For Vijay Devarakonda Song viral - Sakshi

'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరియమైన హీరోయిన్‌ పాయల్ ‌రాజ్‌పుత్. బోల్డ్‌ క్యారెక్టర్‌తో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వెంకటేష్‌-నాగ చైతన్యతో కలిసి 'వెంకీమామ' చిత్రంలో నటించింది ఈ భామ. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే..కుదిరినప్పుడల్లా స్పెషల్‌ సాంగ్స్‌, వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాకుండా హాట్‌  ఫోటొషూట్‌లతో మతి పోగొట్టే పాయల్‌...సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

తాజాగా విజయ్‌ దేవరకొండ నటించిన  ‘గీత గోవిందం’ సినిమాలోని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..అనే సూపర్‌ హిట్‌ సాంగ్‌కి తన ఎంతో క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా..ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. మీరు అలా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తే..మేం చచ్చిపోతామంటూ అబ్బాయిలు..పాయల్‌పై మనసు పారేసుకుంటున్నారు. 

చదవండి : భార్యకు ఖరీదైన‌ గిఫ్టిచ్చిన ఎన్టీఆర్!
చిరు, బాలయ్యలతో బాలీవుడ్‌ భామ రొమాన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement