ఓటీటీలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక.. చిన్న సినిమాలకు ఆదరణ పెరిగింది. కథలో స్టఫ్ ఉంటే చాలు ఓటీటీ వేదికపై రికార్డులు సృష్టిస్తున్నాయి. ఓటీటీ పుణ్యమా అని స్టార్ హీరోలే కాదు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ జనం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అందుకే యువ దర్శకులు కొత్త హీరోలతో డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న సినిమాలు ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ని సాధించగా.. తాజాగా థియేటర్స్‌లో విడుదలై సూపర్ రెస్పాన్స్ అందుకున్న 'రావణలంక' అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తోంది.
సినిమా కథలో స్టఫ్ ఉండాలే గానీ ఆ సినిమా విజయాన్ని ఆపడం ఎవ్వరితరం కాదు. ఒకప్పటిలా కాకుండా ప్రేక్షకుల ధోరణి, అభిరుచిలో క్రమంగా మార్పు చోటుచేసుకుంది. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు భారీ ప్రేక్షకాదరణ దక్కుతుండటం చూస్తున్నాం. స్టార్ హీరోలే కాదు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ జనం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు ఓటీటీ వేదికల పరిధి విస్తరించడం అప్‌కమింగ్ హీరోలకు వరంగా మారింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలై సూపర్ రెస్పాన్స్ అందుకున్న 'రావణలంక' మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన తెచ్చుకుంటోంది.
కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌పై బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ 'రావణలంక' మూవీ విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించిన క్రిష్ బండిపల్లి స్వయంగా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టడం విశేషం. చిత్రంలో క్రిష్ జోడీగా అశ్విత, త్రిష నటించారు. సీనియర్ నటులు మురళి శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రలు పోషించారు.
నవంబర్ 19న 150 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత జనవరి 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ ప్రతి రోజు దాదాపు 5 లక్షల వ్యూస్‌తో టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో క్రిష్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినీ పెద్దలు సైతం క్రిష్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయనకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే క్రిష్‌తో మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment