
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినీ ప్రముఖులు ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ తెలంగాణ పోలీసులతో కలిసి ఓ వీడియో రూపొందించగా.. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ‘తప్పనిసరైతేనే బయటకు రండి. అనవసరంగా బయటకు రావొద్దు. జాగ్రత్తలు తప్పక పాటించండి’ అంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు, సూచనలు ప్రజలతో పాటు తన అభిమానులకు చెప్పాడు.
‘రోజురోజుకు కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ ధరించండి. మర్చిపోవద్దు. అవసరమైతేనే బయటకు అడుగు పెట్టండి. ఒకవేళ కరోనా వైరస్ వస్తే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో తెలుసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీనిద్వారా అవసరమైన వారికి బెడ్లు అందుతాయి. ఈ క్లిష్ట పరిస్థితులు నుంచి మరింత దృఢంగా తయారవుతామని నేను నమ్ముతున్నా. ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని ట్వీట్ చేశారు.
చదవండి: కరోనా రోగి ప్రాణం నిలిపిన వలంటీర్లు: సీఎం ప్రశంస
చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
As the COVID-19 cases surge everyday, please remember to wear your mask every time you're around people and step out only if it's absolutely necessary!
— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021
Comments
Please login to add a commentAdd a comment