"ఉరి: ద సర్జికల్ స్టైక్".. కశ్మీర్‌లోని ఉరి స్టెకార్లలో 2016లో భారత ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్‌హరి తదితరులు పోషించారు. రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ.342 కోట్లు రాబట్టింది. బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా రిలీజై నేటికి సరిగ్గా రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా విక్కీ కౌశల్ ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. ఇందులో అశ్వత్థామ తనను ప్రార్థించమని శివుడిని కోరగానే ఆయన ప్రత్యక్షమై ఓ ఖడ్గాన్ని బహుకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. చూస్తుంటే ఓరకమైన భక్తితో ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఫస్ట్ లుక్ వైరల్‌గా మారింది. (చదవండి: రివ్యూ టైమ్: మాస్ మసాలా వయొలెంట్ క్రాక్)
ఇక ఉరిని తెరకెక్కించిన ఆదిత్య ధరే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా గురించి విక్కీ మాట్లాడుతూ.. ఆదిత్య కలలు గన్న ప్రాజెక్ట్ అశ్వత్థామ. ఇది కచ్చితంగా నటుడిగా నాకు మరింత గుర్తింపు తెచ్చిపెడుతుంది అని చెప్పుకొచ్చారు. దీనికి రోనీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు యుద్ధ విద్యను నేర్పిన మహాగురువు ద్రోణాచార్య కుమారుడే అశ్వత్థామ. తండ్రి చేత మరణమనేదే లేని వరాన్ని ఎలా పొందాడు? తర్వాత జరిగిన పరిణామాలేంటి? అన్న విషయాలను ప్రధానంగా తెరకెక్కించనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: కరోనా టీకా తీసుకున్న మొట్టమొదటి బాలీవుడ్ నటి)
Comments
Please login to add a commentAdd a comment