సల్మాన్ ఖాన్ నటించిన ‘అంతిమ్’ సినిమా గుర్తుండే ఉంటుంది. పోనీ అందులోని చింగారీ పాట? అరే.. ఆ పాటను.. ఆ పాట మీద మహారాష్ట్ర జానపద నృత్యం ‘లావణి’ని నర్తించిన వలూశా డిసూజాను ఎలా మరచిపోతాం అంటారా? అందుకే ఇంకోసారి గుర్తు చేయడానికి వలూశా డిసూజా వివరాలను తీసుకొచ్చాం..
► వలూశా.. యురోపియన్ ఇండియన్. తల్లి జర్మన్.. తండ్రి పోర్చుగీసు. ఆమె పుట్టింది, పెరిగింది గోవాలో. చదివింది ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో. సైకాలజీలో డిగ్రీ చేసింది.
► చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం వలూశాకు. అందుకే అథ్లెట్‌గా రాణించింది. తర్వాత మోడలింగ్‌లో అవకాశాలు రావడంతో మోడల్ అయింది.
► షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ గుర్తుంది కదా.. 2016లో వచ్చింది. అందులో వలూశా నటించింది. ఆ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసింది. ‘ఫ్యాన్’ నిర్మాతలకే కాదు వలూశాకూ ఫెయిల్యూరే. దానితో ఆమెకెలాంటి గుర్తింపు రాలేదు.
► ఆ చిత్రం ఇవ్వలేని రికగ్నిషన్‌ను ‘అంతిమ్’ ఇచ్చింది.. చింగారీ పాటతో. అప్పటి నుంచి వలూశా నటిగా బిజీగానే ఉంటోంది.
► ఇప్పుడు హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న టెక్ థ్రిల్లర్ ‘ఎస్కేప్ లైవ్’తో వెబ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యి దేశంలోని గడప గడపకూ ఆమెను పరిచయం చేసింది.. వెబ్ ప్రేమికులను ఆమె వీరాభిమానులుగా మారుస్తోంది.
►నా చుట్టూ ఉన్న నెగెటివిటీ నుంచి సాధ్యమైనంత వరకు తప్పించుకుంటూ ఉంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో రియాలిటీ నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియా ఓ మార్గంగా మారింది చాలా మందికి. అది ఆహ్వానించదగ్గ పరిణామం కాదేమో!
– వలూశా డిసూజా
Comments
Please login to add a commentAdd a comment