జైదీప్ అహ్లావత్.. మహారాజ వెబ్ సిరీస్‌తో ఈ ఏడాది ట్రెండింగ్‌లోకి వచ్చాడీ నటుడు. ఇతడు విజయ్ వర్మకు క్లోజ్ ఫ్రెండ్ కూడా! వీరిద్దరూ పుణెలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కలిసి చదువుకున్నారు. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈఫ్రెండ్స్ భాగీ 3, జానె జాన్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.
సడన్‌గా పెళ్లి వాయిదా
తాజాగా ఈ మిత్రులిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ముందుగా జైదీప్ మాట్లాడుతూ.. నా జూనియర్ జ్యోతి హుడాతో 2009లో నా పెళ్లి జరిగింది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు విజయ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. కొత్త బట్టలు తీసుకున్నాడు. అయితే అక్షయ్ కుమార్ 'కట్టా మీటా' సినిమా కోసం చివరి నిమిషంలో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అన్నాడు.
అంత స్థోమత లేదు
ఇంతలో విజయ్ వర్మ అందుకుంటూ.. అప్పుడు మా టికెట్లు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ టికెట్లు కొనేంత స్థోమత కూడా లేదు. అందుకే వాయిదా పడ్డ పెళ్లికి వెళ్లలేకపోయాం. అందుకు చాలా బాధపడ్డాం. దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు మేమెవరం అతడితో మాట్లాడలేదు.
దుఃఖం ఆపుకోలేకపోయాం
కొన్ని నెలల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం. అప్పుడు జైదీప్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. స్నేహితుల్లో ఏ ఒక్కరూ పెళ్లికి రాలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని అలా చూడగానే మా అందరికీ దుఃఖం ఆగలేదు అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment