
జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిలి'. గతేడాది ‘రూహి’తో భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్న జాన్వీ.. ఈ సారి ఎలాగైనా ‘మిలి’తో హిట్టు కొట్టాలని తెగ కష్టపడుతుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘హెలెన్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రెస్టారెంట్‌లో పార్ట్ టైం జాబ్ చేసుకునే అమ్మాయి.. మైనస్ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడిందన్నదే మిలి కథ. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. నవంబర్ 4న ఈ సినిమా విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment