Watch: RRR Movie Jr NTR Entry Scene Making Video Goes Viral - Sakshi
Sakshi News home page

RRR: పెద్దపులితో ఎన్టీఆర్‌ పోరాటం.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ సీన్‌ ఎలా తీశారంటే..

Published Sat, Aug 27 2022 2:59 PM | Last Updated on Sat, Aug 27 2022 3:26 PM

Jr NTR Entry Scene Making Video Out From RRR Movie - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియ చిత్రం ‘ఆర్‌ఆ‍ర్‌ఆర్‌’. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం.. భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించింది. . విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది.
(చదవండి: ఓటీటీలో రామారావు ఆన్‌ డ్యూటీ, స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడంటే?)

ముఖ్యంగా తారక్‌ ఎంట్రీ సీన్స్‌ మాత్రం థియేటర్స్‌లో ఈలలు వేయించాయి. పెద్దపులితో ఎన్టీఆర్‌ పోరాటం చేసే సన్నివేశం చూస్తుంటే.. సీటులో కూర్చున్న ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ఈ సీన్‌ని చిత్రీకరించడానికి మేకర్స్‌  ఎంత కష్టపడ్డారో, ఎలా చిత్రీకరించారో తెలియజేస్తూ తాజాగా మేకింగ్‌ వీడియోని వదిలారు. 1.09నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తారక్‌పై దాడి చేసేందుకు పులి ఎలా పరుగెత్తుతుంది?, ఏ విధంగా పంజా విసురుతుంది? తదితర విషయాలను రాజమౌళి క్షుణ్ణంగా వివరించడమే కాకుండా.. ఆయనే నటించి చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రేమికులను ఆకట్టుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement