
సాక్షి, హైదరాబాద్: కొత్తజంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూలు ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో సందడి చేశారు. మూవీ యూనిట్ వీరికి బొకేలతో స్వాగతం పలికారు. కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. దర్శకుడు కొరటాల శివ, డీఓపీ తిరు సహా పలువురు కాజల్, గౌతమ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: ‘అందాల రాక్షసి’ బర్త్‌డే.. చీర కట్టులో..)
కాగా నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరులో గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన ఆమె నేడు హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో చెర్రీ అతిథి పాత్రలో మెరవనున్నారు. విద్యార్థి నాయకుడిగా కనిపించే చరణ్‌కు కియారా అద్వానీని జోడీగా ఎంపిక చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment