Kajal Aggarwal Emotional Post On Her Son Neil After He Turns Six Months Old, Deets Inside - Sakshi
Sakshi News home page

Kajal Agarwal:కొడుకు పోజులు చూసి మురిసిపోతున్న కాజల్‌.. ఎమోషనల్‌ పోస్ట్‌

Published Thu, Oct 20 2022 11:36 AM | Last Updated on Thu, Oct 20 2022 12:30 PM

Kajal Agarwal Shares New Picture Of Her Son Neil As He Turns SIx Months - Sakshi

టాలీవుడ్‌ ‘చందమామ’ కాజల్‌ అగర్వాల్‌ ఈ ఏడాది జూన్‌ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన కొడుకుకి నీల్‌ కిచ్లూ అని నామకరణం చేసింది. ప్రస్తుతం తన సమయమంతా కొడుకుకే కేటాయిస్తుంది ఈ బ్యూటీ. తల్లిగా తను పొందే ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. కొడుకు పుట్టి ఆరు నెలలు అవుతున్న సందర్భంగా ఓ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది కాజల్‌. అందులో బుడ్డోడు నుదుటిపై చేతులు వేసుకొని చిరునవ్వులు చిందుస్తూ ముద్దుగా ఉన్నాడు.

ఈ ఫోటోని షేర్‌ చేస్తూ తన జీవితంలోకి నీల్‌ కిచ్లూ వచ్చాక ఎలాంటి మార్పు వచ్చింది చెప్పుకొచ్చింది. ‘గత ఆరు నెలలు ఎలా గడిచిపోయాయో నాకు తెలియడం లేదు. యవ్వనంలో ఉన్నప్పుడు ఓ తల్లిగా నాకర్తవ్యాన్ని నెరవేరుస్తానా లేదా అన్న అనుమానం,భయం నాలో ఉండేది. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంత బిజీగా ఉనప్పటికీ.. నీ కోసం సమయం కేటాయిస్తాను. నీపై ఎప్పుడు అశ్రద్ధ చూపించను. 

రాత్రుల్లో నువ్ అటూ ఇటూ దొర్లడం, నేలపై పాకడం చూసి సంతోషపడుతున్నాను. నీ జీవితంలో తొలిసారి జరిగే ప్రతి మూమెంట్‌ నాకు ఇంకా గుర్తున్నాయ్.
నేను, నీ డాడీ కలిసి నీ కాలేజ్ రోజులను తలుచుకుంటూ నవ్వుకుంటున్నాం. నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తల్లిగా చేసే బాధ్యతలు గొప్పవని అందరూ అంటుంటారు.. ఇదంతా నాకు కొత్తే గానీ ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు పుట్టి ఏడాది అవ్వడానికి ఇంకా సగం దూరం ఉంది. మై లవ్ మై బేబీ నీల్'.. అంటూ కాజల్ రాసుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement