బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి నెటిజన్లను ఆగ్రహనికి గురైయింది. అమెరికన్ బ్రాండ్ టోర్న్ జీన్స్, వెస్టర్న్ వేర్ దుస్తులు ధరించే వారిని ఉద్దేస్తూ సోషల్ మీడియా వేదికగా కంగనా చురకలు అంటించింది. దీంతో కంగనా వెస్టర్న్ వేర్ దుస్తుల్లో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ ఆమెపై విరుచుకుపుడుతున్నారు. కాగా కంగనా గురువారం భారత్, జపాన్, సిరియా దేశాలను చెందిన ముగ్గురు మొదటి మహిళల ఫొటోను షేర్ చేసింది. 1885 నాటి ఈ చిత్రంలోని ఆ ముగ్గురు మహిళలు ఆయా దేశాలకు చెందిన మొదటి మహిళా డాక్టర్లుగా లైసెన్స్ పొందారు.
అయితే ఆ ముగ్గురు మహిళలు ఆయా దేశాలకు చెందిన సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. దీనికి ‘ఈ ముగ్గురు మహిళలు వారి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా వారి వారి దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించారు. కానీ ప్రస్తుతం కాలంలో వారిలా గుర్తింపు పొందిన వారంత అమెరికన్ బ్రాండ్స్ అయినా టోర్న్ జీన్స్, రాగ్స్ ధరించి అమెరికన్ మార్కెట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది. దీంతో నెటిన్లంత కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అలా అయితే కంగనా కూడా సింగ్గుపడాలి, ఎందుకంటే గతంలో తాను ఇలాంటి దుస్తులు ధరించింది’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేగాక గతంలో కంగనా విదేశి బ్రాండ్ దుస్తులు, వెస్టర్స్ వేర్ ధరించిన ఫొటోలను సేకరించి షేర్ చేయడం ప్రారంభించారు. అయితే గతంలో కేవలం గ్లామర్ పాత్రల్లోనే నటించిన కంగనా ప్రన్తుతం మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’లో లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఆ తర్వాత తన తదుపరి చిత్రంలో కంగనా భారత తొలి మహిళ ప్రధాన మంత్రి, ఉక్కు మహిళగా(ఐరన్ లేడీ) పేరొందిన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.
Appreciation tweet for ancient women who not only represented their individuality but their entire civilisation,cultures and nations. Today if such achievers are to be clicked they will all wear torn American jeans n rags like blouses,representing nothing but American marketing. pic.twitter.com/0k2yjUuF07
— Kangana Ranaut (@KanganaTeam) March 3, 2021
చదవండి: ‘శ్రీదేవి తరువాత ఆ ఘనత నాకే సాధ్యం’
భజన వీడియోకు ముగ్ధురాలైన కంగనా
Comments
Please login to add a commentAdd a comment