Kangana Ranaut Diagnosed Dengue But Continues To Work On Emergency - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: డెంగ్యూను లెక్కచేయని కంగనా, నువ్వు నిజంగా ఇన్‌స్పిరేషన్‌..

Published Tue, Aug 9 2022 4:26 PM | Last Updated on Tue, Aug 9 2022 5:13 PM

Kangana Ranaut Diagnosed Dengue But Continues to Work on Emergency - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ డెంగ్యూబారిన పడింది. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ ఆమె సెట్స్‌లో అడుగుపెట్టడం విశేషం. ఇప్పటివరకు హీరోయిన్‌గా అలరించిన ఆమె ఎమర్జెన్సీ మూవీతో దర్శకురాలిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే కదా! ఈ సినిమా మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన ఆమె ఇటీవల అస్వస్థతకు లోనైంది. పరీక్షలు చేయించుకోగా సోమవారం నాడు ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా తను సినిమా పనుల్లో నిమగ్నమైంది. ఈమేరకు కొన్ని ఫొటోలను ఆమె సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలింస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

'డెంగ్యూ వచ్చి తెల్ల రక్తకణాలు తగ్గిపోయి, జ్వరంతో ఒళ్లంతా కాలిపోతున్నా మీరు మాత్రం పని చేయడం ఆపడంలేదు. దీన్ని ప్యాషన్‌ కాదు పిచ్చి అంటారు. కంగనా రనౌత్‌ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం' అని రాసుకొచ్చింది. దీనిపై సదరు కథానాయిక స్పందిస్తూ.. 'థ్యాంక్‌ యూ టీమ్‌.. అయినా బాడీకి జబ్బు వచ్చింది కానీ నా ఆశయానికి కాదు' అని రిప్లై ఇచ్చింది. కాగా కంగనా ఎమర్జెన్సీ మూవీలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించనుంది. హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ డేవిడ్‌ మలినోస్కి ఈ సినిమాకు పని చేస్తున్నాడు.

చదవండి:  మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్‌
సోనమ్‌.. నీ ఫ్రెండ్స్‌ ఎంతమందితో అతడు బెడ్‌ షేర్‌ చేసుకున్నాడు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement