Kapata Nataka Sutradhari Movie Now Streaming On Aha OTT Platform - Sakshi
Sakshi News home page

Kapata Nataka Sutradhari Movie : ఓటీటీలోకి వచ్చేసిన ‘కపట నాటక సూత్రధారి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Published Sat, Oct 22 2022 10:54 AM | Last Updated on Sat, Oct 22 2022 11:16 AM

Kapata Nataka Sutradhari Movie Ott Release Date - Sakshi

సినిమాలో సత్తా ఉండి, కంటెంట్‌ కొత్తగా ఉంటే థియేటర్‌,ఓటీటీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌ కంటే కొత్తదనం ఉన్న సినిమాలను జనాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా ఓ బ్యాంక్ దొంగతనం చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన 'కపట నాటక సూత్రధారి' సినిమాకు థియేటర్లో మాంచి రెస్పాన్స్ వచిచ్న సంగతి తెలిసిందే.

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కపట నాటక సూత్రధారి’ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడీ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. నేడు(శనివారం)నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

క్రాంతి సైన దర్శకత్వం వహించిన ఈ సినిమా కి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు.సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ, రామ్ తవ్వ సంగీతం, రామకృష్ణ మాటలు అందించారు. నటీనటులు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌,థ్రిల్లింగ్, క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టేలా కథనం ఉండటం సినిమాకు మరింత ప్లస్‌ అయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement