
ఈ మధ్యకాలంలో కొంతమంది నటీనటులు తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నారు. పార్టీలలో అతిగా మద్యం సేవించి బయటకు వచ్చాక నానా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇలాంటి సంఘటలు తరచుగా జరుగుతున్నాయి. పార్టీలలో తప్పతాగి రోడ్డుపై హల్‌చల్ చేసిన వీడియోలు గతంలో ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా మరో బాలీవుడ్ నటి కూడా అతిగా మద్యం సేవించి మత్తులో మీడియా ముందే భర్తకు లిప్‌లాక్ ఇచ్చింది.
బాలీవుడ్ నటి కశ్మీరా షా తాజాగా భర్త కృష్ణ అభిషేక్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్లింది. అక్కడ అతిగా మద్యం సేవించి వెళ్తున్న సమయంలో మీడియా పకలరించింది. దీంతో ఆమె మత్తులో రకరకాల భంగిమళ్లో ఫోజులు ఇచ్చింది. భర్త కృష్ణ అభిషేక్ ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. అతన్ని గట్టిగా లాగి లిప్‌లాక్ ఇచ్చేసింది. ఆయన వద్దని వారిస్తున్నా సరే వినకుండా ముద్దులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కశ్మీరా షా సినిమాల విషయానికొస్తే.. 1997లో షారుఖ్‌ఖాన్ నటించిన ఎస్ బాస్ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోయి కిసీ సే కమ్ నహిన్, ప్యార్ తో హోనా హిథా, హిందుస్తాన్‌కి కసమ్, కహిన్ ప్యార్ న హో జాయే, ఔర్ పప్పు పాస్ హో గయా తదితర చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2013లో నటుడు కృష్ణ అభిషేక్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం కశ్మీరా సినిమాలకు దూరంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment