Keerthi Suresh Shares 'Samantha Die Hard Fan Little Girl' Video Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి, వీడియో వైరల్‌

Published Sat, Feb 5 2022 12:03 PM | Last Updated on Sat, Feb 5 2022 12:55 PM

Keerthi Suresh Shares Samantha Little Girl Fan Video Goes Viral - Sakshi

టాలీవుడ్‌లోని టాప్‌ హీరోయిన్లలో సమంతది అగ్రస్థానం. అందచందాలతో పాటు అభినయంతోనూ కట్టిపడేసే ఈ భామ ఆమధ్య ఫ్యామిలీమ్యాన్‌ 2 వెబ్‌సిరీస్‌లో నటించి హిందీ ప్రేక్షకులకూ దగ్గరైంది. తెలుగులో బోలెడన్ని సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న వీలు చిక్కితే చాలు స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తోంది. దీనికి సంబంధించిన వీడియోలను సైతం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.

నవ్వుతో మాయ చేసే సమంతకు చిన్నపిల్లల నుంచి పెద్దవారిదాకా అందరూ ఫ్యాన్సే! తాజాగా మహానటి కీర్తి సురేశ్‌ సామ్‌ చిన్నారి అభిమాని వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?' అని ఒక చిన్నారిని అడగ్గా అందుకామె సమంత అవుతానని బదులిచ్చింది. సమంతకు తాను వీరాభిమానినని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ వీడియో షేర్‌ చేసిన కీర్తి.. 'ఇక్కడున్న చిన్నారి మీ డై హార్డ్‌ ఫ్యాన్‌ సమంత.. మీరు ఆమెను ఒకసారైనా కలుసుకోవాలి సామ్‌' అని రాసుకొచ్చింది. దీనికి సమంత రిప్లై ఇస్తూ ఎవరీ క్యూటీ అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement