ఒకప్పుడంటే సినిమాల హవా నడిచేది గానీ ఇప్పుడు వెబ్ సిరీస్‌లు రాజ్యమేలుతున్నాయి. మూవీస్‌కి దీటుగా వీటిని తీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామంది యాక్టర్స్‌ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నవి వెబ్ సిరీస్‌లే. అందుకే స్టార్ హీరోహీరోయిన్స్ కూడా ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్)
23 ఏళ్ల క్రితమే మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేశ్.. 2013లో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ పాగా వేయడానికి రెడీ అవుతోంది. 'తెరి' రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇది రిలీజ్ కావడానికి ముందే ఓ వెబ్ సిరీస్‌తో అలరించనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ దీన్ని తీస్తోంది.
కీర్తి సురేశ్‌తో పాటు రాధికా ఆప్టే మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌కు 'అక్కా' టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్‌గా ఓ మాదిరి గ్లామర్ చూపిస్తూ వచ్చిన కీర్తి.. సెన్సార్ పరిధులు లేని ఈ సిరీస్‌లో ఎలా కనిపిస్తుందనేది ఇంట్రెస్టింగ్ విషయం.
(ఇదీ చదవండి: మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్‌కాంత్.. అదే కారణం?)
Comments
Please login to add a commentAdd a comment