
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా మే12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం.
ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలతో మూవీటీం బిజీ అయ్యింది. తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. హాఫ్ స్క్రీన్‌లో మహేశ్ బాబు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందని అడగ్గా.. ఆయనతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుందని కీర్తి సురేష్ పేర్కొంది. ఓ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు నా టైమింగ్ మిస్సయ్యి స్టెప్పులు మర్చిపోయాను.
ఆ సమయంలో పొరపాటున నా చేయి మహేశ్ సార్ ముఖానికి రెండుసార్లు తగిలింది. అప్పటికే సారీ చెప్పగా, మూడోసారి కూడా అదే రిపీట్ కావడంతో ‘నేను ఏమైనా తప్పు చేశానా నీకు?’అంటూ మహేశ్ సరదాగా అడిగారని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment