హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్ | Kiran Abbavaram Marriage Date Revealed by Rahasya Gorak | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: బర్త్ డే స్పెషల్.. రొమాంటిక్ వీడియో షేర్ చేసిన కాబోయే భార్య

Published Mon, Jul 15 2024 8:14 AM | Last Updated on Mon, Jul 15 2024 8:44 AM

Kiran Abbavaram Marriage Date Revealed by Rahasya Gorak

హీరో కిరణ్ అబ్బవరం పెళ్లికి రెడీ అయిపోయాడు. తన మొదటి సినిమా హీరోయిన్‌నే ప్రేమించిన ఇతడు.. చాన్నాళ్ల పాటు సీక్రెట్‌గా తన బంధాన్ని మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఈ ఏడాది మార్చిలో తన రిలేషన్ గురించి బయటపెట్టడంతో పాటు మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లెప్పుడా అనేది ఇంకా చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు కిరణ్‌కి పుట్టినరోజు శుభాకాంంక్షలు చెప్పిన కాబోయే భార్య.. పెళ్లి ఎప్పుడు జరగబోతుందో బయటపెట్టేసింది.

(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్‌ హీరో!)

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి 'రాజావారు రాణిగారు' మూవీతో కిరణ్ అబ్బవరం హీరోగా మారాడు. ఇందులో రహస్య గోరఖ్ అనే అమ్మాయి హీరోయిన్‪‌గా చేసింది. ఈ సినిమా తర్వాత కిరణ్ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోగా, రహస్య మాత్రం పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటోంది.

కిరణ్-రహస్య గత కొన్నాళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ దాన్ని బయటపెట్టలేదు. ఈ ఏడాది మార్చి 13న ఎంగేజ్‪‌మెంట్ చేసుకుని అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాజాగా జూలై 15న కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా రహస్య ఓ క్యూట్ రొమాంటిక్ వీడియోని పోస్ట్ చేసి మరీ విషెస్ చెప్పింది. అలానే భర్త అనే పిలిచేందుకు తెగ వెయిట్ చేస్తున్నానని, దీనికి మరో 38 రోజులే ఉందని రాసుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే ఆగస్టు 22న కిరణ్-రహస్య పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.

(ఇదీ చదవండి: మీరు లేకపోతే నేను లేను : ప్రభాస్ స్వీట్‌ వీడియో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement