‘ఆదిపురుష్‌’‌ కోసం తెలుగు నేర్చుకుంటున్న ‘సీత’! | Kriti Sanon Goes the Extra Mile for Adipurush On Learns Telugu | Sakshi
Sakshi News home page

‘ఆదిపురుష్‌’‌ కోసం తెలుగు నేర్చుకుంటున్న ‘సీత’!

Published Fri, Mar 26 2021 12:56 AM | Last Updated on Fri, Mar 26 2021 11:45 AM

Kriti Sanon Goes the Extra Mile for Adipurush On Learns Telugu - Sakshi

కృతీ సనన్‌

‘అందరికీ నమస్కారం..  బాగున్నారా! యాక్చువల్లీ ఐ డోంట్‌ నో తెలుగు. నెక్ట్స్‌ టైమ్‌ ఐ విల్‌ స్పీక్‌ ఇన్‌ తెలుగు..’ అంటూ తెలుగు చిత్రాల్లో నటించే పరభాషా తారలు అనడం పలు వేడుకల్లో విన్నాం. ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగుకి పరిచయం అయిన బాలీవుడ్‌ భామ కృతీ సనన్‌ కూడా అలానే అన్నారు. ఆ తర్వాత కూడా పెద్దగా తెలుగు నేర్చుకోలేదామె.

ఇప్పుడు నేర్చుకునే పని మీద ఉన్నారు. ఔం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ సరసన కృతీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ది రాముడి పాత్ర. కృతీది సీత పాత్ర. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్యూటర్‌ని పెట్టి, కృతీకి తెలుగు నేర్పిస్తోందట చిత్రబృందం. సో.. ఈ సినిమా వేడుకలో ‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు వచ్చేసింది’ అని కృతీ అంటారేమో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement