మగధీర మళ్లీ వస్తున్నాడు  | Magadheera to be re released in theatres on Ram Charan birthday | Sakshi
Sakshi News home page

మగధీర మళ్లీ వస్తున్నాడు 

Published Tue, Mar 19 2024 1:16 AM | Last Updated on Tue, Mar 19 2024 1:16 AM

Magadheera to be re released in theatres on Ram Charan birthday - Sakshi

మెగా అభిమానులకు శుభవార్త. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా ‘మగధీర’ చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన ‘మగధీర’ 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు.

‘‘మగధీర’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి’’ అన్నారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.  ఈ రోజుల్లోనూ... ఈ నెల రీ రిలీజ్‌ అవుతున్న చిత్రాల్లో శ్రీ, రేష్మ జంటగా మారుతి దర్శకత్వం వహించిన ‘ఈ రోజుల్లో’ కూడా ఉంది. గుడ్‌ సినిమా గ్రూప్‌ బ్యానర్‌పై యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా 2012 మార్చి 23న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని 12 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్‌. ఈ నెల 23న ‘ఈ రోజుల్లో’ విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement