తమిళ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ఈ సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్. గోపినాధ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళి నటించారు. ఈ నెల 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా కారణంగా విడుదల వాయిదపడినప్పటికీ అందరి అంచనాలను అధిగమిస్తూ అనూహ్య విజయాన్ని అందుకుంది. అంతేగాక ఓటీటీలో మొదటి విజయాన్ని అందుకున్న చిత్రంగానూ రికార్డులకెక్కింది. తెలుగులో సూర్య పాత్రకు టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు. చదవండి: దుబాయ్‌కు మహేష్ బైబై
కాగా ఆకాశం నీ హద్దురా సినిమాలోని సూర్య నటనపై అభిమానులతోపాటు తోటి సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. నటుడు, సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను చూసిన టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. సూర్య నటనను చూసిన తరువాత తప్పకుండా ప్రేమలో పడిపోతారు. అపర్ణ నటన సహజంగా ఉందని కితాబిచ్చారు. అపర్ణ వంటి అద్బుతమైన అమ్మాయి డైరెక్టర్ సుధకు ఎక్కడ కనిపిస్తారోనని, సుధా కొంగరతో త్వరలో సినిమా చేస్తానని కూడా విజయ్ తెలిపారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆకాశం నీ హద్దురా సినిమాను కొనియాడారు. సినిమా ఆదర్శవంతంగా ఉందని అన్నారు. దర్శకురాలు సుధా కొంగర అద్భుతంగా తెరకెక్కించారని, సూర్య నటన బాగుందని, టాప్ ఫామ్‌లో ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తారు. చిత్ర యూనిట్‌కు శుభాకంక్షలు తెలిపారు. చదవండి: స్త్రీలు ఎగరేసిన విమానం
#SooraraiPottru 👏👏👏 What an inspiring film!! Brilliantly directed with amazing performances... @Suriya_offl in top form😎😎😎Shine on brother...🤗🤗🤗Congrats to the entire team👌👌👌@Aparnabala2 @Sudhakongara_of @gvprakash @nikethbommi
— Mahesh Babu (@urstrulyMahesh) November 18, 2020
Comments
Please login to add a commentAdd a comment