Malavika Mohanan Goes Size Zero For Thangalaan Movie, Video Viral - Sakshi
Sakshi News home page

Malavika Mohanan: సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో మాళవిక.. అసలు ఏమైనా తింటున్నావా?

Published Fri, May 5 2023 6:55 AM | Last Updated on Fri, May 5 2023 10:10 AM

Malavika Mohanan Latest Looks Goes Viral In Social Media - Sakshi

సిక్స్‌ ప్యాక్స్‌, 8 ప్యాక్‌ల హీరోలా తరహాలో తామూ మారగలం అని నేటి హీరోయిన్లు చాటి చెపుతున్నారు. ముఖాల్లో గ్లో పోయినా పర్వాలేదు. సన్నపడటమే ధ్యేయం అన్నట్లు దూసుకుపోతున్నారు. ఆ మధ్య నత్తి కీర్తి సురేష్‌ ఇలానే కసరత్తులు చేసి బాగా బక్కజిక్కి పోయింది. అప్పట్లో పలు విమర్శలను ఎదుర్కొన్న ఆమె ఆ తర్వాత మళ్లీ కొత్త అందాలను సంతరించుకుందనుకోండీ.

 తాజాగా నటి మాళవిక మోహన్‌ కూడా జీరో సైజ్‌ కోసం తెగ కసరత్తులు చేసేస్తోంది. ఈమెది వాస్తవానికి జీరో సైజ్‌ బాడినే. అయితే సిక్స్‌ ప్యాక్‌ కోసం మరింత కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం రోజులో ఎక్కువ భాగం జిమ్ముల్లోనే గడిపేస్తుందట. ఈ బాలీవుడ్‌ బ్యూటీ రజనీకాంత్‌ కథానాయకుడు నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

(ఇది చదవండి: తరాలు మారినా ఎమోషన్స్‌ మారలేదు)

 ఆ తర్వాత లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో విజయ్‌ కథానాయకుడుగా నటించిన మాస్టర్‌ చిత్రంలో ఆయనకు జంటగా నటించింది. అదేవిధంగా ధనుష్‌ సరసన మారన్‌ చిత్రంలోనూ నటించింది. ఇవేవీ ఈ అమ్మకి స్టార్‌డమ్‌ను తెచ్చి పెట్టలేదు కాగా చిన్న గ్యాప్‌ తర్వాత తాజాగా తంగలాన్‌ చిత్రంలో విక్రమ్‌తో జత కడుతోంది. 

పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ గెటప్‌ ఇప్పటికే ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ఈ చిత్రం కోసం పూర్తిగా ఆదివాసి నాయకుడిగా మారిపోయారు. కాగా నటి మాళవిక మోహన్‌ కూడా ఈ చిత్రం కోసమే కసరత్తులు చేసి సిక్స్‌ ప్యాక్‌కు మారినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ ఫొటోలను, వీడియోను ఈమె సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అందులో ఎక్కువగా తన నడుమును చూపించే ఫొటోలే చోటు చేసుకోవటం గమనార్హం. దీంతో మాళవిక మోహన్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌ మొదలైంది. అసలు ఏమైనా తింటున్నావా, కాస్త మంచినీళ్లయినా తాగమ్మా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

(ఇది చదవండి: నంది పురస్కారం లేక ఏడేళ్లు.. ఎక్కువ అవార్డులు ఏ హీరోకో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement