
హీరోయిన్ మమత కులకర్ణి (Mamta Kulkarni) సన్యాసం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించానలుకున్న ఆమె ఫిబ్రవరి వరకు కుంభమేళాలో ఉంటానని పేర్కొంది. జనవరి 24న కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది.
సాధ్విగా మారిపోయిన హీరోయిన్
కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షతో, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో ఆమె నిజమైన సాధ్విగా మారిపోయింది. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ఆమె ఇలా సాధ్విగా మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మమత కులకర్ణి సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది. కరణ్ అర్జున్, దిల్‌బర్, క్రాంతివీర్, సబ్‌సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది.
చదవండి: అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ..
Comments
Please login to add a commentAdd a comment