రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష‍్మీ | Manchu Lakshmi Says I Stayed In Ram Charan House In Mumbai Secretly, Know Reason Inside | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: చరణ్ ఇంట్లో ఉండటానికి కారణం.. ఎందుకు ఎవరికీ చెప్పలేదంటే?

Jul 1 2024 7:29 AM | Updated on Jul 1 2024 8:53 AM

Manchu Lakshmi Staying In Ram Charan House Mumbai

మోహన్ బాబు కూతురు మంచు లక్ష‍్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మాటలతో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్‌చల్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లతో ఈమెకు చాలామంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ విషయాన్నే మంచు లక్ష‍్మీ బయటపెట్టింది. ముంబైలో తాను రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో రివీల్ చేసింది. అలానే తమ సీక్రెట్ వాట్సాప్ గురించి కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొత్తం బయటపెట్టేసింది.

తనని ముంబై రమ్మని.. రానా, రకుల్ ప్రీత్ చాలా సార్లు చెప్పారని అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే అపార్ట్‌మెంట్ దొరక్కపోవడంతో కొన్నాళ్ల పాటు చరణ్ ఇంట్లో ఉండాల్సి వచ్చిందని మంచు లక్ష‍్మీ చెప్పింది. ఇంకా ఏమేం చెప్పిందంటే...?

(ఇదీ చదవండి: వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ)

'ముంబైకి నేను షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండటానికి నాకు అపార్ట్‌మెంట్ లేదు. దీంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పనిచేయాల్సిన అవసరం ఏంటని అంటారు. అందుకే నేను ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్‌కి కూడా చెప్పాను. దీంతో నేను ఎందుకు చెబుతా అని అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా! ఇప్పుడు నేనే చెప్పేశా. కానీ అంత అందమైన ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్ప లేదు. దీంతో వెళ్లిపోతానని చెప్పా. అయితే నీకు నచ్చినన్నీ రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు. అలా ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్‌కి తెలీదు' అని మంచు లక్ష‍్మి చెప్పుకొచ్చింది.

అలా ఇండస్ట్రీలోని 142 మంది ఆర్టిస్టులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని మంచు లక్ష‍్మి చెప్పింది. ఇందులో చరణ్, రానాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని తమ తమ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఈ గ్రూప్‌లో షేర్ చేస్తుంటారని.. అలా తామందరం తమ పర్సనల్ అకౌంట్స్‌లో షేర్ చేసి ప్రమోట్ చేస్తుంటామని ఈమె చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement