Manchu Lakshmi Tests Positive for Coronavirus - Sakshi
Sakshi News home page

మంచు లక్ష్మికి కరోనా.. టైమ్‌పాస్‌ కోసం మంచి సినిమాలు చెప్పండంటూ ట్వీట్‌

Jan 6 2022 6:27 PM | Updated on Jan 6 2022 7:03 PM

Manchu Lakshmi Tests Positive For Coronavirus - Sakshi

దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్‌ ఉంటుంది కదా. అందుకే నన్ను విడిచిపెట్టలేదు

మంచు వారి అమ్మాయి, నటి లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్‌ ఉంటుంది కదా. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్‌తో నానుంచి దాన్ని ఎలాగైనా పంపించేస్తా.

అందరూ ఇంట్లో సేఫ్‌గా ఉండండి. మాస్కులు కచ్చితంగా ధరించండి. వాక్సిన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సా​ర్లు టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్‌ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి’ అని మంచు లక్ష్మీ వరుస ట్వీట్స్‌ చేసింది. అలాగే టైమ్‌ పాస్‌ కోసం టాప్‌ 3 మూవీస్‌, షోలు, పాడ్‌కాస్ట్‌లు ఉంటే చెప్పండంటూ అభిమానులను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement