
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటలీలో ఈ సినిమా షూటింగ్ ప్యాక్ అప్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్ర బృందం కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. షూటింగ్ లొకేషన్‌లో నాగ చైతన్య కలిసి దిగిన ఓ సెల్ఫీని రాశిఖన్నా అభిమానులతో పంచుకుంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు నిలిపివేస్తే.. ‘థ్యాంక్యూ’ చిత్రబృందం మాత్రం చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లింది. కోవిడ్ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయిందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ తాజాగా షేర్ చేసిన ఫోటోతో ఆ వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయాయి. థ్యాంక్యూ' ఇటలీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
#onset #thankyouthemovie @chay_akkineni pic.twitter.com/xQD0Nb9SWg
— Raashii Khanna (@RaashiiKhanna_) May 7, 2021
Comments
Please login to add a commentAdd a comment