నేను మారిపోయాను, చాలా సంతోషంగా ఉన్నా: నాగచైతన్య | Naga Chaitanya: I Have Changed a lot as a Person | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: నేను మారిపోయా, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా..

Published Sat, Jul 23 2022 3:10 PM | Last Updated on Tue, Jul 26 2022 4:19 PM

Naga Chaitanya: I Have Changed a lot as a Person - Sakshi

టాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగచైతన్య గతేడాది విడిపోయిన విషయం తెలిసిందే! అయితే ఇప్పటికీ వీరి గురించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక తాజాగా సామ్‌ కాఫీ విత్‌ కరణ్‌ షోలో విడాకుల గురించి చేసిక కామెంట్లు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. భరణం లాంటిది ఏమీ తీసుకోలేదని కుండ బద్ధలు కొట్టేసిన సామ్‌ తనను, చైని ఒకే గదిలో ఉంచితే ఆయుధాలు దాచిపెట్టాల్సిందేనని తెలిపింది.

ఇక హోస్ట్‌ చైను భర్తగా సంభోదించగా.. వెంటనే అడ్డుపడిన సమంత.. భర్త కాదు.. మాజీ భర్త అని పిలవండి అని చురకలంటించింది. అలా సమంత ఓపెన్‌ అయిందో లేదో ఇటు నాగచైతన్య కూడా తన జీవితం ఎలా సాగుతుందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'ఒక వ్యక్తిగా నేను చాలా మారాను. గతంలో ఇంత ఓపెన్‌గా ఉండేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతున్నాను. నా కుటుంబం, ఫ్రెండ్స్‌తో అనుబంధం ఇంకా పెరిగినట్లు అనిపిస్తోంది. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొన్నాడు.

చదవండి: రవితేజ సెట్‌కి వస్తే మెరుపులే.. ఎనర్జీతో నిండిపోతుంది
‘అలాంటి పురుషులను కలిశా.. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement