
ప్రతి పండుగను మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీలో జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగను కూడా చిరంజీవి తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. అయితే ఈ సారి మెగా ఫ్యామిలీ జరుపుకున్న సంక్రాంతి వేడుకకి ఓ హీరో ముఖ్య అతిథిగా హాజరై కనువిందు చేశారు. ఆ హీరో ఎవరో కాదు.. చిరంజీవి స్నేహితుడు, కింగ్ నాగార్జున. పండగవేళ చిరు ఇంటికి వెళ్లిన నాగ్.. మెగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ కచేరితో, రుచికరమైన ఫుడ్ ను ఆరగిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ స్టార్ హీరోలు. చిరంజీవి, నాగార్జునతోపాటు రాంచరణ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు.
ఇటీవలే జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్‌లో చిరంజీవి, నాగార్జున ప్రేక్షక లోకానికి కనువిందు చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇలా సంక్రాంతి వేళ ఓకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అటు మెగా అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్రేమ్‌లో నాగార్జున నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment