మళ్లీ జంటగా కనిపిస్తారా?  | Nani And Aditi Rao Hydari May Work For The Second Time | Sakshi
Sakshi News home page

మళ్లీ జంటగా కనిపిస్తారా? 

Published Wed, Aug 19 2020 2:33 AM | Last Updated on Wed, Aug 19 2020 2:33 AM

Nani And Aditi Rao Hydari May Work For The Second Time - Sakshi

నాని, అదితీ రావ్‌ హైదరీ ‘వి’ సినిమాలో కలసి నటించారు. తాజాగా మరోసారి జోడీ కట్టనున్నట్టు సమాచారం. ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంకృతియాన్‌ దర్శకత్వంలో నాని ఓ సినిమా కమిట్‌ అయిన సంగతి తెలిసందే. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ టైటిల్‌ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ నిర్మించనుంది. ఇందులో నానీకి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. అలానే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా ఉన్నారని తెలిసింది. ఆ పాత్రకు  అదితీ రావ్‌ హైదరీని తీసుకున్నట్టు సమాచారం. దీంతో రెండోసారి నాని, అదితీని జంటగా చూడొచ్చన్నమాట. ‘ఎంసీఏ’ తర్వాత ఈ సినిమా కోసం సాయి పల్లవి, నాని  కూడా మళ్లీ కలసి  నటించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టులో ప్రారంభించి, డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కరోనా వల్ల ప్లాన్‌ మొత్తం మారింది. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement