సినిమా అంటే నానికి ఎంత ప్రేమో.. వైరలవుతున్న ట్వీట్‌ | Nani On His Birthday: Last 15 Years I Was Born Again And Again | Sakshi
Sakshi News home page

Nani: సినిమా అంటే ఎంత ప్రేమో.. నాని ట్వీట్‌ చూశారా?

Published Fri, Feb 24 2023 3:38 PM | Last Updated on Fri, Feb 24 2023 3:38 PM

Nani On His Birthday: Last 15 Years I Was Born Again And Again - Sakshi

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్టార్‌గా ఎదిగిన హీరోలలో నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. స్టార్‌ హీరోగా ఎదిగాడు. నేడు(ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా నాని అభిమానులు ఆయన బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెస్తున్నారు. ఈ క్రమంలో నాని ట్విటర్‌లో ఎమోషనలయ్యాడు.

'1984 ఫిబ్రవరి 24 శుక్రవారం నేను రిలీజయ్యాను(జన్మించాను). గత పదిహేనేళ్లలో ఎన్నోసార్లు పుడుతూనే ఉన్నాను. ఈసారి వచ్చిన శుక్రవారం బర్త్‌డేలాగే మీ ప్రేమానురాగాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. సినిమా అంటే నానికి ఎంత ప్రేమో ఈ ఒక్క ట్వీట్‌తో అర్థమవుతోంది. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇకపోతే తన కెరీర్‌లో ఎక్కువగా క్లాస్‌ సినిమాలే చేసిన ఈ హీరో ఈసారి మాత్రం దసరాతో ఫుల్‌ మాస్‌ క్యారెక్టర్‌తో ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల 30న విడుదల కానుంది.

చదవండి: పెళ్లిలో కన్యాదానం చేయనన్న తల్లి, ఏడ్చేసిన హన్సిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement