Nani Tuck Jagadish Say Not Coming On OTT Platform: Makers Aiming For A Theatrical Release - Sakshi
Sakshi News home page

Natural Star Nani:‘టక్ జగదీష్’ విడుదల రూమర్లపై క్లారిటీ

Published Thu, May 27 2021 2:55 PM | Last Updated on Thu, May 27 2021 3:44 PM

Nani Tuck Jagadish Say Not Coming On OTT Platform: Makers Aiming For A Theatrical Release - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టక్‌ జగదీశ్‌’.ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో  తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహూ గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది.

ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశంలో లేకపోడంతో విడుదల తేదిని ప్రకటించలేదు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ఇటీవల పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం. . టక్ జగదీష్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడం లేదని, వదంతులు నమ్మవద్దంటూ టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. 

చదవండి:
నాగార్జున సినిమాలో యాంకర్‌ రష్మీ
లవ్‌ మ్యారేజే, కాదంటే చంపుతా: అరియానా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement